Uppal: తెలంగాణ రక్షణ సేన ఉప్పల్ ఇన్‌చార్జిగా శ్రామన్ దేవ్ నియామకం!
Uppal: తెలంగాణ రక్షణ సేన ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పంజిరాయ్ శ్రామన్ దేవ్ నియమితులయ్యారు.
Uppal: తెలంగాణ రక్షణ సేన ఉప్పల్ ఇన్‌చార్జిగా శ్రామన్ దేవ్ నియామకం!
Uppal: తెలంగాణ రక్షణ సేన ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా పంజిరాయ్ శ్రామన్ దేవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం టీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఈగ సంతోష్ ముదిరాజ్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు ఉరుసు బాలకృష్ణ, టీఆర్ఎస్ ఉప్పల్ సీనియర్ నాయకులు కృష్ణా నాయక్, రంగు శేఖర్ గౌడ్, సంఘీ శ్రీనివాస్, కాయ శంకర్, కటారి సతీష్‌తో పాటు పలువురు నాయకులు ఆయనను ఉప్పల్ బ్యాంక్ కాలనీలోని తన నివాసంలో కలిసి అభినందించి, నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
పార్టీ అధిష్ఠానం శ్రామన్ దేవ్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం అభినందనీయమని, ఆయన నాయకత్వంలో ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతం అవుతుందని ఈగ సంతోష్ ముదిరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంజిరాయ్ శ్రామన్ దేవ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బాధ్యతను ప్రజాసేవకు లభించిన అవకాశంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు. సీనియర్ నాయకుల మార్గదర్శకత్వం, కార్యకర్తల సహకారంతో పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికీ చేరవేసి, పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంజిరాయ్ శ్రామన్ దేవ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.




