Vanasthalipuram: ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: పరకాల ప్రభాకర్
Vanasthalipuram: సహారా ఎస్టేట్‌లో ‘80 ఏళ్ల స్వాతంత్ర్యం - పౌరుల హక్కులు’ అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ప్రసంగించారు.
Vanasthalipuram: ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత: పరకాల ప్రభాకర్
వనస్థలిపురం: 80 ఏళ్ల స్వాతంత్రం పౌరుల హక్కులు అనే అంశంపై సహారా ఎస్టేట్లో సెమినార్ నిర్వహించడం జరిగింది . దీనికి సీనియర్ సిటిజన్ అధ్యక్షులు ఎన్ ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా రాజకీయ విశ్లేషకులు, ఆర్థికవేత్త, వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ హాజరై ప్రసంగించారు.
రాజ్యాంగం అనేదాన్ని ప్రజల రక్షణకై ఏర్పాటు చేసుకున్నాము. కానీ పాలకవర్గాలే రాజ్యాంగాన్ని బలహీనపరిచేటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను ఒక్కటొక్కటిగా నెమ్మది నెమ్మదిగా హరించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. దీనిని ఎత్తిచూపవలసిన పత్రికలు, మీడియా 90% కార్పోరేట్ వర్గాల చేతుల్లో ఉన్నవి. ఫలితంగా ప్రభుత్వం యొక్క పాలనాపరమైన విధానాలలో మంచేదో చెడేదో ప్రజలకు చేరటం లేదు. పూర్తిగా అధికార వర్గాలకు వంత పాడుతూ ఉన్నాయి.
పార్లమెంటులో ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏవి ఏవికూడా చర్చకు రావడం లేదు అని పరకాల ప్రభాకర్ తెలియజేశారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయవలసిన ఎన్నికల వ్యవస్థ కూడా అధికారానికి బంది అయ్యింది అని చెప్పవచ్చు. ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలు ADR అసోసియేషన్ (ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) అనే సంస్థ ఒక నివేదికలో ఎత్తి చూపనైనది. ముఖ్యంగా పోలైన ఓట్ల కంటేకౌంటింగ్ లో వచ్చిన ఓట్ల సంఖ్య అధికంగా ఉన్నాయని చెప్పి నైనది.
మూడు సంవత్సరాల తర్వాత కోర్టు దీనిని జరిగిందేదో జరిగింది అన్న పద్ధతిలో కొట్టివేశారు. దీన్ని బట్టి చట్టం అమలు కావటం లేదన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రజలు స్తబ్దతగా ఉన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఈ రాజ్యాంగం ఇలాగే ఉంటుందా ? ఉండదా చెప్పలేం. జాతీయ జెండా కూడా మారవచ్చు.
ప్రజలు, ప్రజాస్వామ్య యుతంగా సమావేశాలు పెట్టుకునే స్వేచ్ఛ ఇక ముందు ఉండక పోవచ్చు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చ లేవనెత్తకుండా కేవలం వందేమాతరం జనగణమన పేరుతో పార్లమెంటులో ఎక్కువ సమయాన్ని వృధా చేస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా జనగణమనకు మంగళం పాడేందుకు అధికారంలో ఉన్నవారు ప్రయత్నిస్తున్నారు. SIR పేరుతో ఎన్నికల వ్యవస్థని బలహీనపరిచే అవకాశం ఉంది.ఈ పేరుతొ కొద్దిమంది పేర్లు తొలగించే నెపంతో ఎక్కువమంది పేర్లను ఎన్నికల లిస్టులో లేకుండా చేస్తున్నారు.
ఓటర్ లిస్టులో అనర్హులు ఉన్నారన్న పేరుతో, తమకు నచ్చని ఇతరులను కూడా తొలగిస్తున్నారు. ఈ విషయంలో ప్రజల విన్నపాలను ఎన్నికల వ్యవస్థ పట్టించుకోవడం లేదు. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీన పడుతుంది. ఇది రాబోయే కాలంలో మన దేశానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది. కాబట్టి ప్రజలు తమ పౌరసత్వాన్ని కాపాడుకోవాలంటే, పౌరులుగా, సంస్థలుగా స్పందించాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థల్ని నెమ్మది నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం యొక్క కుట్రల్ని ఆపగలగాలి. ప్రజాస్వామ్య హక్కులను ప్రజలే కాపాడుకోవాలని అన్నారు. నేడు ఎస్ ఐ ఆర్ లో ఓటు ఉందని అనుకున్న వారిది కూడా ఎన్నికల సరికి వారి ఓట్లు తొలగించారని అనేది కూడా ఏమీ లేదని లేదన్నారు. కాలనీలో నీ ప్రజలు లేవనెత్తిన అనేక సమస్యలకు సమాధానాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నోముల సుదర్శన్ రెడ్డి, ఫ్యాక నాయకులు రవీంద్ర శర్మ, డి ఎ ఎస్ వి ప్రసాద్ రావు, ఉమామహేశ్వరరావు, కామేష్ బాబు, ఎస్ కే జానీ, ఎన్ అంజయ్య, కీసరి నర్సిరెడ్డి, ఏబూసి నరసింహ, పృద్వి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.




