Chandanagar: చందానగర్ సీఎంఎస్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, తల్లిదండ్రుల ఆందోళన!

Chandanagar: చందానగర్ సీఎంఎస్ జూనియర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత. ఫీజుల పేరుతో విద్యార్థులను పరీక్షకు అనుమతించకపోవడంతో కళాశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Sept 2026 1:05 PM IST
Chandanagar
X

Chandanagar: చందానగర్ సీఎంఎస్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, తల్లిదండ్రుల ఆందోళన!

Chandanagar: చందానగర్‌లోని CMS జూనియర్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫీజుల పేరుతో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను యాజమాన్యం వేధిస్తోందంటూ బాధితులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు.

ఫీజు బకాయిలు ఉన్నాయనే నెపంతో ఇంటర్మీడియట్ విద్యార్థులను పరీక్ష రాసేందుకు కాలేజీ యాజమాన్యం నిరాకరించింది. ఉదయం 9:30 గంటల వరకు విద్యార్థులను ఒక ప్రత్యేక గదిలో కూర్చోబెట్టి తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మొత్తం ₹1,05,000 ఫీజుకు గానూ ఇప్పటికే ₹71,000 చెల్లించామని ఒక బాధితురాలి తల్లి తెలిపారు. అయినప్పటికీ, అడ్మిషన్ సమయంలో కుదుర్చుకున్న మొత్తం కంటే అదనంగా డబ్బులు చెల్లించాలని యాజమాన్యం తీవ్ర ఒత్తిడి తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజు బకాయిలు మరియు అదనపు వసూళ్లపై నిలదీస్తే కాలేజీ ఇన్ ఛార్జ్‌లు కనీస బాధ్యత లేకుండా "నచ్చకపోతే కాలేజీ నుంచి TC తీసుకెళ్లండి" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తల్లిదండ్రులు ఆరోపించారు.

పరీక్ష రాయకుండా నిలిపివేసిన విద్యార్థినిని వెంటనే పరీక్షకు అనుమతించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ, మానసిక ఆందోళనకు గురిచేస్తున్న CMS కాలేజీ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్