Pargi: 37 ఏళ్ల తర్వాత ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Pargi: పరిగిలో 1988-89 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు 37 ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. గురువులను సన్మించి, భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు.

WAZID, PARIGI
Published on: 31 Aug 2026 7:49 PM IST
Pargi
X

Pargi: 37 ఏళ్ల తర్వాత ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

పరిగి: 37 ఏళ్ల తర్వాత కలిసిన 1988–89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు,ఎక్కడ అనుకున్నారు ,వికారాబాద్ జిల్లా పరిగిలోని శారద గార్డెన్‌లో 1988–89 బ్యాచ్‌కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.పరిగి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 1988–89 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు, దాదాపు 37 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకున్నారు.

150 మంది విద్యార్థులు చిన్ననాటి స్నేహితులను మళ్లీ కలుసుకోవడంతో కార్యక్రమం మొత్తం ఆత్మీయత, ఆనందంతో నిండిపోయింది.ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన పూర్వ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. గురువులతో కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటి పాఠశాల రోజులను నెమరువేసుకున్నారు.

మరో ప్రత్యేకతగా... తాము చదువుకున్న సమయంలో పాఠశాలలో అటెండర్‌గా పనిచేసిన వ్యక్తిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన చేతుల మీదుగా స్కూల్ బెల్ కొట్టించి కార్యక్రమాన్ని ప్రారంభించడం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.అనంతరం 1988–89 బ్యాచ్‌కు చెందిన ప్రతి పూర్వ విద్యార్థి తమ పేరు, ప్రస్తుతం తాము చేస్తున్న పని, జీవితంలో సాధించిన విషయాలను ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.

అయితే ఈ ఆత్మీయ కలయికలో విషాదం కూడా చోటుచేసుకుంది. తమతో కలిసి చదువుకున్న కొంతమంది విద్యార్థులు, తమకు పాఠాలు చెప్పిన కొంతమంది ఉపాధ్యాయులు మరణించడంతో... వారి ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.తమతో కలిసి చదువుకున్న మిత్రుల జ్ఞాపకార్థం వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్న పూర్వ విద్యార్థులు... మరణించిన ప్రతి విద్యార్థి కుటుంబానికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా 1988–89 బ్యాచ్ పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ...దాదాపు 37 సంవత్సరాల తర్వాత మేమంతా మళ్లీ ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను, మాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మళ్లీ కలుసుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఎన్ని సంవత్సరాలు గడిచినా మా స్నేహబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం” అని ఆనందం వ్యక్తం చేశారు.

WAZID, PARIGI

WAZID, PARIGI