Pargi: పరిగిలో అష్టాదశ శక్తి పీఠాల పూజా మహోత్సవం

Pargi: వికారాబాద్ జిల్లా పరిగి బహార్‌పేట్‌లో స్రవంతి భవాని స్వాముల ఆధ్వర్యంలో అష్టాదశ శక్తి పీఠాల పూజలు జరిగాయి. డాక్టర్ భాస్కర్ యోగి పాల్గొన్నారు.

WAZID, PARIGI
Published on: 18 Oct 2026 5:56 PM IST
Pargi
X

Pargi: పరిగిలో అష్టాదశ శక్తి పీఠాల పూజా మహోత్సవం

Pargi: దుర్గా భవాని నామస్మరణతో పరిగి పట్టణం మార్మోగింది.. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని బహార్‌పేట్‌లో స్రవంతి భవాని స్వాముల బృందం ఆధ్వర్యంలో అష్టాదశ శక్తి పీఠాల పూజా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ భాస్కర్ యోగి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవి నవరాత్రుల్లో అమ్మవారిని నిష్టతో పూజించడం ద్వారా సుఖసంతోషాలు కలుగుతాయని, అష్టాదశ శక్తి పీఠాలను స్మరించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పేర్కొన్నారు.

భవాని మాల ధరించిన స్వాములు నియమ నిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని సూచించారు..అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆర్కెస్ట్రా బృందం ఆలపించిన భక్తి గీతాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు

WAZID, PARIGI

WAZID, PARIGI