Pargi: పరిగి: ఆగస్టు 2, 3న బోనాల ఉత్సవాలు.. చైర్‌పర్సన్ ప్రకటన!

Pargi: పరిగి: ఆగస్టు 2, 3న ఆషాఢ బోనాల ఉత్సవాలు. మైసమ్మ, పోచమ్మ ఆలయాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత వెంకటేష్ ఆదేశాలు.

WAZID, PARIGI
Published on: 30 July 2026 2:32 PM IST
Pargi
X

Pargi: పరిగి: ఆగస్టు 2, 3న బోనాల ఉత్సవాలు.. చైర్‌పర్సన్ ప్రకటన!

PARGI: పరిగిలో ఆగస్టు 2, 3 తేదీల్లో ఘనంగా బోనాల ఉత్సవాలు..

పరిగి పట్టణంలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసం సందర్భంగా నిర్వహించే బోనాల ఉత్సవాలు ఈ ఏడాది ఆగస్టు 2న మైసమ్మ తల్లి బోనాలు, ఆగస్టు 3న పోచమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పరిగి పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి కుటుంబ సమేతంగా బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.

ఆదివారం, సోమవారం జరిగే ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణతో పాటు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను మైసమ్మ, పోచమ్మ దేవాలయాల వద్ద ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

పరిగి పట్టణ మహిళలు, యువకులు, పెద్దలు, హిందూ బంధువులందరూ భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను శాంతియుతంగా, వైభవంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ విజ్ఞప్తి చేశారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story