Pargi: పరిగిలో ఘనంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
Pargi: పరిగిలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి నివాసంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజించాలని రితిక్ రెడ్డి పిలుపు.
Pargi: పరిగిలో ఘనంగా మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
Pargi: వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పరిగి పట్టణంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి నివాసంలో ఉమా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉమా రామ్మోహన్ రెడ్డి, యువ నాయకులు, టీపీసీసీ మెంబర్ డాక్టర్ టి. రితిక్ రెడ్డితో పాటు స్థానిక నాయకులు ప్రజలకు మట్టి వినాయకులను పంపిణీ చేశారు.పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంతో పాటు చెరువులు, నీటి వనరులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని డాక్టర్ టి. రితిక్ రెడ్డి పిలుపునిచ్చారు.
మట్టి వినాయకుల వినియోగం వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా మన సంప్రదాయాలను కూడా కాపాడుకోవచ్చని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పార్థసారథి పంతులు, మున్సిపల్ చైర్మన్ రజిత వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్లు పరశురాం రెడ్డి, ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ అధ్యక్షులు వెంకట్రాములు, రామకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్ రాజ పుల్లారెడ్డి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.




