Pargi: 'ఫీజుల బకాయి - బీజేపీ లడాయి' పోస్టర్ ఆవిష్కరణ
Pargi: పరిగిలో బీజేవైఎం 'ఫీజుల బకాయి - బీజేపీ లడాయి' పోస్టర్ ఆవిష్కరించిన మారుతి కిరణ్. స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్.
Pargi: 'ఫీజుల బకాయి - బీజేపీ లడాయి' పోస్టర్ ఆవిష్కరణ
పర్గి: భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమంలో భాగంగా రూపొందించిన పోస్టర్‌ను బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో పెరుగుతున్న విద్యా ఫీజులను నియంత్రించేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, బీజేవైఎం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం నిరంతరం పోరాటం చేస్తాయని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పరిగి అసెంబ్లీ కన్వీనర్ ఉగ్ర నరసింహ, SIR పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ గేరింటి కేశవులు, బీజేపీ సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్, నస్కల్ వెంకటయ్య, శ్రీనివాస్, శ్యాంసుందర్, బీజేవైఎం పరిగి పట్ట




