Pargi: సాగునీటి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే రామ్మోహన్!
Pargi: పరిగి నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధిపై ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Pargi: సాగునీటి పనులను వేగవంతం చేయాలి ఎమ్మెల్యే రామ్మోహన్!
Pargi: సాగునీటి అభివృద్ధి పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఇరిగేషన్ శాఖకు చెందిన SE, DEE, EE, AEE స్థాయి అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పరిగి నియోజకవర్గంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల అభివృద్ధి, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ పనుల పురోగతితో పాటు కొత్తగా చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలపై అధికారులతో ఎమ్మెల్యే విస్తృతంగా చర్చించారు.రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
నియోజకవర్గంలో సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.




