Pargi: పరిగిలో "సఫాయి అప్నావ్ – బీమారీ భాగవ్" అవగాహన సదస్సు
Pargi: పరిగి ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో పారిశుద్ధ్యంపై అవగాహన సదస్సు. హాజరైన మున్సిపల్ చైర్‌పర్సన్ రజిత, కమిషనర్ మల్లేష్.
Pargi: పరిగిలో "సఫాయి అప్నావ్ – బీమారీ భాగవ్" అవగాహన సదస్సు
పరిగి: పరిశుభ్రతే ఆరోగ్యానికి మొదటి మెట్టు అనే సందేశంతో పరిగిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు పారిశుద్ధ్యం, దోమల నివారణపై అవగాహన కల్పించారు. పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్‌లో బుధవారం "సఫాయి అప్నావ్ – బీమారీ భాగవ్" పేరుతో పారిశుద్ధ్య అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పరిగి మున్సిపల్ కమిషనర్ కె. మల్లేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. మల్లేష్ మాట్లాడుతూ, వర్షాకాలంలో పరిసరాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
అనంతరం హెల్త్ అసిస్టెంట్ రాఘవేందర్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థినులతో పారిశుద్ధ్య ప్రతిజ్ఞ చేయించారు. తమ కుటుంబాలు, కాలనీల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించే బాధ్యత ప్రతి విద్యార్థిని తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, హెల్త్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.




