Pargi: నేను నీకు రక్ష.. మనమంతా దేశానికి రక్ష: పరిగిలో రక్షాబంధన్!

Pargi: పరిగి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు పోలీసులు, ప్రభుత్వ సిబ్బందికి రాఖీలు కట్టారు.

WAZID, PARIGI
Published on: 27 Aug 2026 7:53 PM IST
Pargi
X

Pargi: నేను నీకు రక్ష.. మనమంతా దేశానికి రక్ష: పరిగిలో రక్షాబంధన్!

పరిగి: పరిగి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో రాఖీ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. “నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనమంతా దేశానికి రక్ష” అనే సందేశంతో విద్యార్థులు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. సోదరభావం, దేశభక్తి, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటేలా కార్యక్రమం కొనసాగింది.విద్యార్థినిలు విద్యార్థులకు, ఆచార్యులకు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. అలాగే పాఠశాల ఆయాలు, మాతాజీలు, విద్యార్థినిలు డ్రైవర్ అన్నలకు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు.

అనంతరం పోలీస్ స్టేషన్ లో అన్నలకు, రిజిస్టర్ కార్యాలయంలోని సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ పండుగ గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు కే. మల్లేష్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ కేవలం అన్నాచెల్లెళ్ల అనుబంధానికి మాత్రమే పరిమితం కాదని, ఆత్మీయత, సోదరభావం, రక్షణ, దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించడంతో పాటు.. సమాజం పట్ల బాధ్యత, దేశభక్తి భావనను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story