Pargi: పరిగి-వికారాబాద్ రోడ్డుపై ప్రాణ సంకటం.. కూలిపోయిన వంతెన పునాదులు!
Pargi: పరిగి-వికారాబాద్ రోడ్డుపై వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. వర్షాలకు పునాదులు కూలిపోయి రహదారి ప్రమాదకరంగా మారింది.
Pargi: పరిగి-వికారాబాద్ రోడ్డుపై ప్రాణ సంకటం.. కూలిపోయిన వంతెన పునాదులు!
PARGI: పరిగి-వికారాబాద్ నిత్యం వేలాది వాహనాలు తిరిగే బిజీ రోడ్డు ఇది. అయితే, ఇక్కడ చేపట్టిన కొత్త బ్రిడ్జి నిర్మాణం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. నిర్మాణ పనుల కోసం బ్రిడ్జి పక్కన భారీగా తవ్వకాలు చేపట్టారు. రాత్రి కురిసిన వర్షానికి వాగు ఒక్కసారిగా పొంగి పొర్లడంతో, ఆ మట్టి అంతా కొట్టుకుపోయి.. ప్రస్తుతం వంతెన ఒక వైపు పునాదులు కూలిపోయాయి. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు వణికిపోతున్నారు.
వర్షాకాలం రాకముందే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాగు పొంగినప్పుడల్లా మా గుండెలు ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనీ వాహన దారులు వాపోతున్నారు. ముందుముందు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు కళ్లు తెరిచి, యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలి లేదా ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలి. లేదంటే ఒక పెద్ద ప్రమాదం జరిగి, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.




