Pargi: పరిగి సబ్‌జైలులో వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మిక తనిఖీ!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి సబ్‌జైలులో ఎస్పీ స్నేహ మెహ్రా భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు.
Pargi: పరిగి సబ్‌జైలులో వికారాబాద్ ఎస్పీ స్నేహ మెహ్రా ఆకస్మిక తనిఖీ!
PARGI: వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS బుధవారం పరిగి సబ్‌జైలును సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్‌జైలులోని భద్రతా ఏర్పాట్లు, ఖైదీల భద్రత, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా సిబ్బంది విధులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. జైలు పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జైలులోకి అనధికారిక వస్తువులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్, జైలు సిబ్బంది సమన్వయంతో తక్షణ చర్యలు చేపట్టేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
భద్రతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, లోపాలు గుర్తించిన వెంటనే వాటిని సరిదిద్దాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా జైలు అధికారులు భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది విధులు, అందుబాటులో ఉన్న భద్రతా పరికరాలపై ఎస్పీకి వివరాలు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రాజేశ్ మీనా, IPS, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, ఏఆర్ డీఎస్పీ వీరేష్, పరిగి సీఐ కొండల్ రెడ్డి, పరిగి సబ్‌జైల్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, పరిగి ఎస్‌ఐ మోహన కృష్ణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.




