Pargi: పరిగిలో జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సన్మానం!
Pargi: పరిగి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ నెం.1 పాఠశాల 2003-04 బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలిచిన తమ మిత్రులను ఘనంగా సన్మానించారు.
Pargi: పరిగిలో జెడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సన్మానం!
PARGI: చిన్ననాటి స్నేహితులు... చదువుకున్న రోజుల జ్ఞాపకాలు... అదే స్నేహబంధంతో మళ్లీ ఒక్కటయ్యారు వికారాబాద్ జిల్లా పరిగిలోని ZPHS Boys No.1 పాఠశాల 2003–04 బ్యాచ్ మిత్రులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, వార్డు సభ్యులుగా ఎన్నికైన తమ బ్యాచ్ మిత్రులను అభినందిస్తూ ఆదివారం పరిగిలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బ్యాచ్ మిత్రులంతా ఒకచోట చేరి పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్నా... తమ మధ్య స్నేహబంధం ఏమాత్రం తగ్గలేదని చాటుకున్నారు.
అనంతరం మిత్రులంతా కలిసి సహపంక్తి భోజనం చేసి ఆత్మీయంగా ముచ్చటించుకున్నారు. చదువుకున్న రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ సాగిన ఈ కార్యక్రమం... స్నేహం, ఐక్యత, ఆత్మీయతలకు ప్రతీకగా నిలిచింది.




