Meerpet: జిల్లెలగూడలో దారుణం పార్క్ చేసిన ఆటోకు నిప్పు!

Meerpet: మీర్‌పేట్ పరిధిలోని జిల్లెలగూడలో పార్క్ చేసిన ఆటోకు నిప్పు. అల్లుడిపైనే అనుమానం ఉందన్న బాధితుడు చందు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల విచారణ.

RAHUL, MEERPET
Published on: 17 Aug 2026 10:00 AM IST
Meerpet
X

Meerpet: జిల్లెలగూడలో దారుణం పార్క్ చేసిన ఆటోకు నిప్పు!

Meerpet: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన ఆటోకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. జిల్లెలగూడ డీఎన్‌ఆర్ కాలనీలో సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఘటనాస్థలిలో పెట్రోల్ బాటిల్‌ను పోలీసులు గుర్తించారు. కుటుంబ వివాదం నేపథ్యంలో తన అల్లుడే ఆటోకు నిప్పు పెట్టి ఉండొచ్చని చందు ఆరోపించారు.

ఆటో యజమాని చందు ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET