Kapra: కాప్రాలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: హీరో తనీష్, మాజీ ఎమ్మెల్యేల హాజరు!
Kapra: మీర్పేట్ హెచ్‌బీ కాలనీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణదేవరాయల సేవాసమితి ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించారు.
Kapra: కాప్రాలో పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: హీరో తనీష్, మాజీ ఎమ్మెల్యేల హాజరు!
కాప్రా: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శ్రీకృష్ణదేవరాయల సేవాసమితి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ హీరో తనీష్, సినీ నటుడు నాగ మహేష్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్ రెడ్డి హాజరై పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా సినీ హీరో తనీష్ , నటుడు నాగ మహేష్, శ్రీకృష్ణదేవరాయల సేవాసమితి కమిటీ అధ్యక్షులు అమర్ బాబు మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం మరియు సినీ అగ్ర హీరో పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, మునుముందు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా 250 నుండి 300 మంది వరకు మెగా స్టార్, పవర్ స్టార్ అభిమానులు రక్తదానం చేసి అన్ని దానాలలో కన్నా రక్తదానం ప్రాణదానం చేయడమేనని అభిమానులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ నోటు పుస్తకాలు అందజేశారు.
అలాగే 3000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితులకు అర్చకులకు వస్త్రాలు సమర్పించి ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వెన్ను తట్టి నడిపిస్తున్న మా శ్రీకృష్ణదేవరాయల సేవ సమితి సలహాదారులు పెద్దలకు, మెగా స్టార్ పవర్ స్టార్ అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.




