Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సేవా కార్యక్రమాలు!
Malkajgiri: మల్కాజిగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, అన్నదానం నిర్వహించిన అభిమానులు.
Malkajgiri: మల్కాజిగిరిలో ఘనంగా పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సేవా కార్యక్రమాలు!
Malkajgiri: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరిలో అభిమానులు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఫ్యాన్స్ అసోసియేషన్, మల్కాజిగిరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అఖిల్ నేతృత్వంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి పలువురికి భోజనం అందించారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. అభిమానాన్ని సేవా కార్యక్రమాల రూపంలో చాటుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో చెర్రీ, రమేష్ గౌడ్, చిక్కీ నాని, రిజ్వాన్ వలి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణలో కార్తిక్, పవన్, నితిన్, జీవన్, వంశీ, కళ్యాణ్, రిత్విక్, పూర్ణ సాయి, రవి తదితరులు పాల్గొన్నారు.




