Quthbullapur: ఫేక్ పోలీస్ ఆఫీసర్ కార్తికేయపై పిడి యాక్ట్ ప్రయోగించిన సైబరాబాద్ సీపీ!
Quthbullapur: పోలీస్ అధికారిగా నటిస్తూ కిడ్నాప్‌లు, దోపిడీలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్థుడు నాగరాజు కార్తికేయపై సైబరాబాద్ సీపీ డాక్టర్ రమేష్ పీడీ చట్టం ప్రయోగించారు.
Quthbullapur: ఫేక్ పోలీస్ ఆఫీసర్ కార్తికేయపై పిడి యాక్ట్ ప్రయోగించిన సైబరాబాద్ సీపీ!
Quthbullapur: పోలీస్ అధికారిగా చెబుతూ పలువురిని మోసం చేసిన కార్తికేయ పై పిడియాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలానికి చెందిన నాగరాజు రఘు వర్మ అలియాస్ నాగారాజు కార్తికేయ, రఘు వర్మ అలియాస్ వంశీ అలియాస్ అల్లూరి విజయ రామ్ అలియాస్ కల్నల్ కార్తికేయ సింగ్ పలు నేరాలు చేయడంతో జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.
హైదరాబాద్‌కు వలస వచ్చిన నిందితుడు డ్రైవర్‌గా పనిచే శాడు. తర్వాత, సులభంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే ఉద్దే శంతో నేరాల బాట పట్టాడు. పోలీసు అధికారిగా నటిస్తూ పలువురిని మోసం చేయడంతో వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. పలువురిని కిడ్నాప్ చేసి, తుపాకులు చూపించి వారి వద్ద ఉన్న నగదును దోచుకున్నాడు, 14 నేరాల్లో నిందితుడిగా ఉన్నాడు.
గతంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021, 2024 సంవత్సరాల్లో పిడి యాక్ట్ పెట్టారు. జైలు నుండి విడుదలైన తర్వాత పోలీసు అధికారిగా నటిస్తూ కిడ్నాప్, బలవంతపు వసూళ్లు, దోపిడీకి సంబంధించిన మరో నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.




