Osmania University: అగ్గిరాజేసిన నిరుద్యోగులు.."మూడేళ్లయినా హామీ ఏది?

Osmania University: 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో జార్జిరెడ్డి పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరుద్యోగులు నిరసన

HARISH, TARNAKA
Published on: 30 Jun 2026 3:35 PM IST
Osmania University
X

Osmania University: అగ్గిరాజేసిన నిరుద్యోగులు.."మూడేళ్లయినా హామీ ఏది?

ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన నోటిఫికేషన్ ఇవ్వాలని, అలాగే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ పోస్టులను 20వేల కు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని జార్జిరెడ్డి పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సుమంత్ లు డిమాండ్ చేశారు.

ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇవ్వాలని కోరుతూ ఓయూలోని ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగులతో కలసి ప్లేకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీ చేపట్టారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

మూడు సంవత్సరాలు గడుస్తున్న నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదన్నారు. డీఎస్సి నోటిఫికేషన్ ను కూడా తక్షణమే విడుదల చేయాలని అన్నారు.

గత ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజేషన్ చేసే సమయంలో అనర్హులు ఉద్యోగాలు పొందారని వారిపై విచారణ చేపట్టి తొలగించాలని డిమాండ్ చేశారు

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story