Tandur: తాండూరులో ప్రశాంత వాతావరణంలో పీస్ కమిటీ సమావేశం!
Tandur: తాండూరు 8వ వార్డులో పోలీసుల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. మిలాద్-ఉన్-నబీ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ విట్టల్ రెడ్డి కోరారు.
Tandur: తాండూరులో ప్రశాంత వాతావరణంలో పీస్ కమిటీ సమావేశం!
Tandur: మిలాద్-ఉన్-నబీ (ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త జయంతి) వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకునే విధంగా పరస్పర సోదరభావంతో నిర్వహించుకోవడానికి పోలీసు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని 8వ వార్డులో 'పీస్ కమిటీ' (శాంతి కమిటీ) సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో స్థానిక వార్డు కౌన్సిలర్ జావీద్, యాలాల ఎస్ఐ విట్టల్ రెడ్డి హాజరై వార్డు ప్రజలతో మాట్లాడుతూ ఊరేగింపులు, ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు మత పెద్దలు, కమిటీ సభ్యులతో సమన్వయ పండుగ జరుపుకోవాలని కోరారు.
అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ఉంటూ, మత సామన్యాన్ని కాపాడుకోవాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. వదంతులు, తప్పుడు ప్రచారాలు మరియు రెచ్చగొట్టే పోస్టులను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని హెచ్చరించారు.శాంతి, ప్రేమ, దయను చాటిచెప్పే ప్రవక్త ముహమ్మద్ బోధనలను ఆచరిస్తూ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు.




