Tandur: నీటి కోసం కందనెల్లి తండాలో ధర్నా సర్పంచ్‌పై గ్రామస్థుల ఆగ్రహం!

Tandur: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండాలో తీవ్ర నీటి కొరతపై ధర్నా. సర్పంచ్ వైఖరిపై గ్రామస్థులు, వార్డు మెంబర్ల తీవ్ర ఆగ్రహం.

Srikanth Reddy, Tandur
Published on: 1 Sept 2026 12:27 PM IST
Tandur
X

Tandur: నీటి కోసం కందనెల్లి తండాలో ధర్నా సర్పంచ్‌పై గ్రామస్థుల ఆగ్రహం!

Tandur: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం కందనెల్లి తండాలో తీవ్ర నీటి కొరతతో గ్రామస్తులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. నీటి కోసం తొమ్మిది రోజులుగా ఇబ్బంది పడుతున్న సర్పంచ్ కనీసం నీటి అవసరాలను తీర్చడానికి ముందుకు రాకపోవడం శోచనీయమన్నారు.

అడగడానికి వార్డు మెంబర్లు వెళ్తే బండ బూతులు తిడుతూ ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ తిట్టి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ సెక్రెటరీ ఎవరో తెలియకుండా పోయిందని ఉన్న పంచాయతీ సెక్రెటరీని సర్పంచ్ తిట్టి భయపెట్టి గ్రామానికి రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశాడన్నారు.

వెంటనే ఎమ్మెల్యే ఈ విషయంపై దృష్టి సాధించి గ్రామానికి ఒక వాటర్ ట్యాంకును మంజూరు చేసి పగిలిపోయిన మిషన్ భగీరథ పైప్లైన్ ను వెంటనే మరమ్మతులు చేయించి గ్రామానికి నీళ్లు అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story