Peerzadiguda: రూ. 1.65 లక్షలకు గణపతి లడ్డూ దక్కించుకున్న శ్రీకాంత్ పటేల్
Peerzadiguda: పీర్జాదిగూడ గోకుల్‌నగర్‌లో ఘనంగా గణపతి నిమజ్జనం. రూ. 1.65 లక్షలకు లడ్డూను దక్కించుకున్న శ్రీకాంత్ పటేల్. వరుసగా మూడోసారి సొంతం.
Peerzadiguda: రూ. 1.65 లక్షలకు గణపతి లడ్డూ దక్కించుకున్న శ్రీకాంత్ పటేల్
పీర్జాదిగూడ: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ గోకుల్‌నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాటకు విశేష స్పందన లభించింది. పోటాపోటీగా సాగిన వేలం పాటలో వీరా శ్రీకాంత్ పటేల్ రూ.1,65,116కు గణపతి లడ్డూను కైవసం చేసుకున్నారు.
గత మూడు సంవత్సరాలుగా వరుసగా గణపతి లడ్డూను తానే దక్కించుకోవడం ఆనందంగా ఉందని శ్రీకాంత్ పటేల్ తెలిపారు. గణపతి ఆశీస్సులతో కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల్లో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.




