Medipally: రాష్ట్రస్థాయి జంప్‌ రోప్‌ ఛాంపియన్‌షిప్‌లో అభియ ప్రతిభ!

Medipally: 5వ రాష్ట్రస్థాయి జంప్ రోప్ ఛాంపియన్‌షిప్‌లో పీర్జాదిగూడ విద్యార్థిని అభియ షారోన్ ప్రతిభ. అండర్-11 విభాగంలో 2 స్వర్ణాలు, 1 రజత పతకం కైవసం.

KARUNAKAR, UPPAL
Published on: 21 Sept 2026 8:50 AM IST
Medipally
X

Medipally: రాష్ట్రస్థాయి జంప్‌ రోప్‌ ఛాంపియన్‌షిప్‌లో అభియ ప్రతిభ!

Medipally: రాష్ట్రస్థాయి జంప్‌ రోప్‌ ఛాంపియన్‌షిప్‌లో పీర్జాదిగూడకు చెందిన విద్యార్థిని చాబతుల అభియ షారోన్‌ ప్రతిభ చాటింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నారపల్లిలోని రోటర్‌ డ్యామ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో శనివారం నిర్వహించిన 5వ రాష్ట్రస్థాయి జంప్‌ రోప్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో అండర్‌–11 విభాగంలో మూడు పతకాలు సాధించింది.

ఇంజురెన్స్‌, రిలే స్పీడ్‌ విభాగాల్లో స్వర్ణ పతకాలు, డబుల్‌ అండర్‌లో రజత పతకం గెలుచుకుంది. పీర్జాదిగూడకు చెందిన చాబతుల విజయ్‌బాబు, అనిత దంపతుల కుమార్తె అయిన అభియ షారోన్‌ ప్రస్తుతం ఇదే పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. కాగా, పోటీలను తెలంగాణ రాష్ట్ర రోప్‌ స్కిప్పింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, పీర్జాదిగూడ మాజీ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి ప్రారంభించారు. రోప్‌ స్కిప్పింగ్‌లో క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

క్రీడలు విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు భవిష్యత్‌లో మంచి అవకాశాలను అందిస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ క్రీడాకారులు ఏషియన్‌ గేమ్స్‌లో రాణించి దేశానికి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అభియ షారోన్‌ను పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ శ్వేతారెడ్డి, ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి, ఈవీ రమణ, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జి సూర్యప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL