Hayathnagar: లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్, కళ్యాణి దంపతులు!

Hayathnagar: హయత్‌నగర్ పిగ్లిపూర్‌లో గణనాథుడి లడ్డూ వేలం పాట: ₹1,63,001లకు లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్-కళ్యాణి దంపతులు, హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు.

AJAY, HAYATH NAGAR
Published on: 27 Sept 2026 11:39 PM IST
Hayathnagar
X

Hayathnagar: లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్, కళ్యాణి దంపతులు!

హయత్నగర్: అబ్దుల్లాపూర్మెట్ పిగ్లిపూర్ గ్రామంలో హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలం పాట ఉత్సాహభరితంగా జరిగింది. ఈ వేలంలో గణనాథుడి లడ్డూను బందేల శేఖర్ కళ్యాణి దంపతులు రూ.1,63,001లకు దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పిగ్లిపూర్ గ్రామ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డి, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, హనుమాన్ యూత్ క్లబ్ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణనాథుడి లడ్డూ వేలం కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR