Tandur: గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చారిత్రాత్మకం.. రోహిత్ రెడ్డి!
Tandur: వికారాబాద్ జిల్లా యాలాల మండలం సంగాయిపల్లి తండాలో కేసీఆర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాలాభిషేకం.
Tandur: గిరిజనులకు కేసీఆర్ చేసిన సేవలు చారిత్రాత్మకం.. రోహిత్ రెడ్డి!
Tandur: గిరిజనుల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమని తాండూరు మాజీ ఎమెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. యాలాల మండలంలోని సంగాయిపల్లి తండాలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, తండావాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గిరిజనుల అభ్యున్నతికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవన్నారు.
గిరిజనుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల కేసీఆర్‌ను గిరిజన బాంధవుడు గా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారన్నారు.
గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్ గారిదేనన్నారు. 2022 సెప్టెంబర్ 17న గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
గిరిజన విద్యార్థుల కోసం గురుకులాల ఏర్పాటు చేయడమే కాకుండా యువత కోసం విద్యా,ఉద్యోగ అవకాశాల కల్పన చేశారన్నారు. గిరిజనుల భూములకు సంబంధించిన 37,779.79 ఎకరాల అంశం, రాష్ట్రంలో 183 గిరిజన గురుకులాల ఏర్పాటు, గిరిజనుల కోసం ఇళ్ల నిర్మాణం, పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎప్పుడూ మర్చిపోరన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సిద్రాల శ్రీనివాస్, రమేష్, రామచంద్రా రెడ్డి, విక్రాంత్, నారాయణ, సుక్యా నాయక్, తార్య నాయక్, గణేష్, తండావాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




