Tandur: పట్నం మహేందర్ రెడ్డి తల్లి మృతికి రోహిత్ రెడ్డి నివాళి!

Tandur: శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి రుక్కమ్మ మృతి పట్ల తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.

Srikanth Reddy, Tandur
Published on: 2 Aug 2026 7:43 AM IST
Tandur
X

Tandur: పట్నం మహేందర్ రెడ్డి తల్లి మృతికి రోహిత్ రెడ్డి నివాళి!

Tandur: శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తల్లి ఇటీవల మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని తాండూరు మాజీ శాసనసభ్యులు పైలట్ రోహిత్ రెడ్డి శనివారం రుక్కమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

రుక్కమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని,శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి,కోడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, షాబాద్ మాజీ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డిని పరామర్శించి తన సంతాపాన్ని తెలియచేసి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భగవంతుడు బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Srikanth Reddy, Tandur

Srikanth Reddy, Tandur

Next Story