Shamshabad : పీజేటీఏయూ అగ్రి అడ్మిషన్ల ప్రక్రియ షురూ..12 ఆఖరి తేదీ!

Shamshabad : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో బీఎస్సీ అగ్రి సీట్లు 2000కు పెరిగాయని, ప్రత్యేక కోటా ఫీజులు భారీగా తగ్గాయని వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 1 Aug 2026 8:56 PM IST
Shamshabad
X

Shamshabad : పీజేటీఏయూ అగ్రి అడ్మిషన్ల ప్రక్రియ షురూ..12 ఆఖరి తేదీ!

శంషాబాద్: 2026-27 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విద్యాలయం పరిధి లోని 13 కళాశాలల్లో బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, ఇతర డిగ్రీ కోర్సులలో ప్రవేశాలకి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోందని ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. తెలంగాణా ఎప్ సెట్ -2026 లో అర్హత సాధించిన అభ్యర్ధులు ఆగష్టు 11 వ తేదీ వరకు దరఖాస్తు రుసుము చెల్లించి ఆగస్టు 12 వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు దాఖలు చేయవచ్చని ఆయన సూచించారు.

తాను ఉప కులపతి గా బాధ్యతలు చేపట్టిన ఈ రెండేళ్ళ లో కొత్త కళాశాలల ఏర్పాటు,సీట్ల పెంపు,రుసుముల తగ్గింపు ల పై ప్రత్యేక దృష్టి సారించినట్లు జానయ్య తెలిపారు. 2023-24 లో బీఎస్సీ(ఆనర్స్)అగ్రికల్చర్ సీట్లు 1012 ఉండగా 2026-27 విద్యాసంవత్సరానికి సుమారు 2,000 అయ్యాయని పేర్కొన్నారు.

ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక వ్యవసాయ కళాశాల ఉండాలన్న PJTAU ప్రతిపాదన కి అనుగుణం గా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు,వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు నిరుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లా లోని హుజూర్ నగర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లోని డిచ్ పల్లి లలో కొత్త కళాశాలల ఏర్పాటుకి అనుమతిచ్చారని తెలిపారు.నిరుడు ఈ కొత్త కళాశాలలలో ఒక్కో దాని లో 30 సీట్లు భర్తీ చేశామన్నారు.ఈ ఏడాది నుంచి ఈ కళాశాల లలో ఒక్కొక్కదాని లో 120 సీట్లు అదనం గా భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

అదే విధం గా ప్రత్యేక కోటా సీట్ల రుసుములని గణనీయం గా తగ్గించామని జానయ్య తెలిపారు.2023-24 లో ప్రత్యేక కోటా సీట్ల ఫీజు ఏక కాలం లో పది లక్షల రూపాయల చెల్లింపు తో పాటు ఒక్కో ఏడాదికి ఒక లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉండేదని తెలిపారు.ఈ రుసుములని గణనీయం గా తగ్గించి 2026-27 కి ఒక్కో సెమిస్టర్ కి రుసుము ని కేవలం రూ.75,000 గా నిర్ణయించామన్నారు.

అదే విధం గా ఎన్.ఆర్.ఐ కోటా లో 2023-24 లో ప్రవేశ సమయం లో అభ్యర్థులు ఒకే సారి 30 లక్షల రూపాయలు చెల్లించి ఒక్కో సెమిస్టర్ కి లక్ష రూపాయల ఫీజు చెల్లించాల్సి వచ్చేదన్నారు .దాన్ని బాగా తగ్గించి 2026-27 కి ఒక్కో సెమిస్టర్ కి రూ.1,35,000 కి పరిమితం చేసామని జానయ్య వివరించారు.

19 వ ర్యాంక్ తో పాటు అన్ని గుర్తింపులు ఉన్న అగ్రి వర్సిటీ, దేశం లోని సుమారు 80 వ్యవసాయ ,మరియు వ్యవసాయ అనుబంధ విశ్వ విద్యాలయాల్లో 2026లో PJTAU 19 వ ర్యాంక్ లో నిలిచిందని జానయ్య తెలిపారు.అంతే కాకుండా 1964 లో దేశం లోనే రెండవ వ్యవసాయ విశ్వ విద్యాలయం గా స్థాపితం అయిన ఈ విశ్వ విద్యాలయం నాటి నుంచి నేటి వరకూ ఐకార్ మరియు యూ జీ సి లు నిర్ధారించిన నాణ్యత,ప్రమాణాలు కలిగి ఉందన్నారు.

ఈ విశ్వ విద్యాలయానికి ,దీని పరిధి లోని అన్ని కళాశాల లకి ,కోర్సులన్నిటి కి ఐకార్ అక్రిడేషన్ ఉందన్నారు.ఐకార్ నిబంధనల ప్రకారం కొత్త గా ఏర్పాటైన కళాశాలల కి తొలి ఐదు సంవత్సరాలు అక్రిడేషన్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఉంటుందన్నారు. కాబట్టి తొలి ఐదేళ్ళు ఐకార్ అక్రిడేషన్ ఉన్నట్లు గానే పరిగణించాల్సి ఉంటుందని వివరించారు. 2027 మార్చి వరకూ PJTAU ,దాని పరిధి లోని అన్ని కళాశాలలు,కోర్సులకి ఐకార్ అక్రిడేషన్ యూజీసీ కి సంబంధించిన విద్యా ప్రమాణాలు ఉన్నాయని పేర్కొన్నారు.

కృత్రిమ మేధస్సు,ఆధునిక ప్రయోగ శాల ల తో కొత్త హంగులు గత రెండేళ్ళ గా PJTAU పరిధి లోని అన్ని కళాశాల లు,పరిశోధనా స్థానాల్లో కృత్రిమ మేధస్సు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన ప్రయోగ శాలలు ,మౌలిక వసతులు ఏర్పాటు చేసి సమకాలీన వ్యవసాయ రంగానికి కావాల్సిన ఆధునిక సాంకేతిక అంశాల్ని బీ ఎస్సీ(అగ్రికల్చర్) సిలబస్ లో చేర్చామని తెలిపారు.తద్వారా PJTAU నుంచి పట్టభద్రులైన వారికి ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం గా చర్యలు తీసుకుంటున్నామని అల్దాస్ జానయ్య వివరించారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story