Shamshabad: ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా తరగతి గదుల్లోనే విద్యార్థుల నిరసన!

Shamshabad: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మహిళా ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా విద్యార్థులు తరగతి గదుల్లోనే నిరసన తెలిపారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 14 Nov 2026 4:58 PM IST
Shamshabad
X

Shamshabad: ప్రొఫెసర్ తేజశ్రీకి మద్దతుగా తరగతి గదుల్లోనే విద్యార్థుల నిరసన!

Shamshabad: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ గారికి మద్దతుగా తరగతి గదుల్లోనే విద్యార్థుల నిరసన.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్‌పై చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళా ప్రొఫెసర్ తేజశ్రీ గారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు.

విద్యార్థులు నిరసనలో పాల్గొనకుండా వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్, ఇతర అధికారులు వారిని తరగతి గదుల నుంచి బయటకు రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అయినప్పటికీ విద్యార్థులు తరగతి గదుల్లోనే నిరసన తెలియజేస్తూ తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిష్పక్షపాత విచారణ జరిగేలా వైస్ ఛాన్సలర్‌ను విధుల నుంచి తప్పించాలని, బాధిత మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD