Ramachandra Rao: భారత్‌ను విశ్వగురు స్థానంలో నిలబెట్టిన మోదీ.. మల్కాజిగిరిలో ఎన్. రామచంద్రరావు వ్యాఖ్యలు!
Ramachandra Rao:
మల్కాజిగిరి/హైదరాబాద్: ప్రపంచంలోనే భారత్ ను ఒక శక్తివంతమైన దేశంగా మోడీ తీర్చిదిద్దుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు తెలిపారు. భారతదేశంలోని అతి ఎక్కువ రోజులు ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మల్కాజిగిరి ఆనంద్ బాగ్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హారతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ సబ్ కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఆర్థికంగా వికసిస్తున్నటువంటి భారత్ ను వికసిత్ భారత్, జన కల్యాను భారత్ గా తీర్చిదిద్దేందుకు ముందుకు సాగుతున్నారని,ప్రపంచంలోనే భారత్ ను ఒక శక్తివంత దేశంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




