Pocharam: పోచారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి - కర్రె రాజేష్
Pocharam: చౌదరిగూడలో పోచారం డివిజన్ కాంగ్రెస్ సమావేశం. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దిశానిర్దేశం చేసిన డివిజన్ అధ్యక్షుడు కర్రె రాజేష్.
Pocharam: పోచారం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి - కర్రె రాజేష్
పోచారం: మల్కాజిగిరి పురపాలక సంస్థ పరిధి ఘట్ కేసర్ సర్కిల్ లోని పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చౌదరిగూడలో జరిగింది. డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్రె రాజేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి డివిజన్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలలో పొందుతున్న ఆదరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా కర్రె రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని అన్నారు. డివిజన్‌లో కొంతమంది కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారని, వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశాలకు నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేవారిపై పార్టీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త సమస్యను తన సమస్యగా భావిస్తానని పేర్కొన్న ఆయన, డివిజన్‌లోని ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ప్రజలు, కార్యకర్తల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
నెల రోజుల్లో మరోసారి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ బలాన్ని మరింత పెంచే కార్యాచరణ చేపడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మార్గదర్శకత్వంలో పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఏర్పడిన విశ్వాసమే పార్టీ విజయాలకు దోహదపడిందని ఆయన పేర్కొన్నారు. ఇదే నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని ఆయన అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కుటుంబ పాలన కొనసాగిందని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ద్వారా పోచారం డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రతి ప్రాంతంలో కాంగ్రెస్ జెండా ఎగరేలా కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని కర్రె రాజేష్ పిలుపునిచ్చారు.




