Pocharam: ఐటీ కారిడార్ పరిధిలో కలకలం ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యం!
Pocharam: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అన్నోజిగూడలో కుటుంబ కలహాల నేపథ్యంలో సరిత (31) అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి అదృశ్యమైంది.
Pocharam: ఐటీ కారిడార్ పరిధిలో కలకలం ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లి అదృశ్యం!
పోచారం: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ కాలనీలో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోచారం ఐటీసీ పోలీసుల వివరాల ప్రకారం.. అన్నోజిగూడకు చెందిన ఓ కూలీ కార్మికుడు తన భార్య సరిత (31) 2009లో వివాహం కాగా, వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఇంట్లో మంచం (కాట్) విషయంలో కుటుంబ సభ్యులతో జరిగిన వాగ్వాదం అనంతరం సరిత ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు 7వ తరగతి చదువుతున్న కుమార్తె అమూల్య (12), 4వ తరగతి చదువుతున్న కుమారుడు రిషిత్ (9) కూడా వెళ్లారు. భార్యకు పలుమార్లు ఫోన్ చేసినా మొదట రింగ్ వెళ్లి, అనంతరం మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు.
గతంలో కూడా కుటుంబ విభేదాల కారణంగా సరిత రెండు సార్లు ఇంటి నుంచి వెళ్లి రెండు, మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చినందున ఈసారి కూడా వస్తుందని భావించి వేచి చూశామని, కానీ ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారుడు పిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు మేరకు పోచారం ఐటీసీ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, అదృశ్యమైన మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.




