Hyderabad: రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో బాబన్న కవితా గానం

Hyderabad: హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనంలో ఆదిలాబాద్ కవి బొల్లారపు బాబన్న కవితా గానం చేసి ప్రశంసలు అందుకున్నారు.

ANNOJULA SRINIVAS  RAO
Published on: 8 May 2026 4:05 PM IST
Hyderabad
X

Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలంగాణ ప్రజా కళా వేదిక కవి సమ్మేళనంలో ఆదిలాబాద్ జిల్లా కవి బొల్లారపు బాబన్న తన కవితా గానం ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అడవులు, ఆదివాసుల సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో రచించిన “అడవి నృత్యం” కవితను బాబన్న వినిపించి సభికుల ప్రశంసలు అందుకున్నారు.

ఈ సందర్భంగా సామాజికవేత్త, ముడుపు ఫౌండేషన్ చైర్మన్ ముడుపు మౌనిష్ రెడ్డి బాబన్నను శాలువాతో సన్మానించి అభినందించారు.

సాహిత్య రంగంలో బాబన్న ఇప్పటికే “చెట్టుతల్లి”, “రణస్వరం”, “కొంచమైతే వెలుతురే” పేర్లతో మూడు కవితా సంపుటాలను ప్రచురించారు. భవిష్యత్తులో బాబన్న మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆదిలాబాద్ యువత తెలుగు సాహిత్యంలో ముందుకు రావాలని మౌనిష్ రెడ్డి ఆకాంక్షించారు.

ANNOJULA SRINIVAS  RAO

ANNOJULA SRINIVAS RAO

Next Story