Uppal: సీనియర్ సిటిజన్లకు పోలీస్ శాఖ ప్రాధాన్యం: సీపీ సుమతి

Uppal: సీనియర్ సిటిజన్ల భద్రత, సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ పెద్దపీట వేస్తోందని మల్కాజిగిరి సీపీ సుమతి ఉప్పల్ చిలుకానగర్ టాస్కా సభలో పేర్కొన్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 2 Oct 2026 7:23 PM IST
Uppal
X

Uppal: సీనియర్ సిటిజన్లకు పోలీస్ శాఖ ప్రాధాన్యం: సీపీ సుమతి

ఉప్పల్: సీనియర్‌ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి పోలీస్‌శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఉప్పల్‌లోని చిలుకానగర్‌లో తెలంగాణ ఆల్‌ సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ (TASCA) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిలుకానగర్‌ డివిజన్‌ శాఖ ఆవిర్భావ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీపీ సుమతి మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్భంగా సీనియర్‌ సిటిజన్ల కార్యక్రమానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక గుర్తింపు ఇస్తోందని, పోలీస్‌శాఖ కూడా వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం కల్పిస్తోందని చెప్పారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సీనియర్‌ సిటిజన్లకు అవసరమైన సహకారం, ప్రాధాన్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సీనియర్‌ సిటిజన్లు తమకు ఎదురయ్యే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైనప్పుడు పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలని సీపీ సూచించారు. వారి భద్రత, సమస్యల పరిష్కారానికి పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

సీనియర్‌ సిటిజన్ల సమస్యల పరిష్కారానికి కృషి

చిలుకానగర్‌ డివిజన్‌లోని సీనియర్‌ సిటిజన్లకు అండగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు బొమ్మగాని దాస్‌గౌడ్‌ తెలిపారు. సీనియర్‌ సిటిజన్ల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. వారికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలు, పోలీస్‌శాఖ సేవలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. నూతన కమిటీ సభ్యులందరి సహకారంతో డివిజన్‌లో సీనియర్‌ సిటిజన్ల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్‌ ఎమ్మార్వో ఫూల్‌సింగ్‌ చౌహాన్‌, సీనియర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.

నూతన కమిటీ ఎన్నిక

చిలుకానగర్‌ డివిజన్‌ శాఖకు నూతన కమిటీని ఈ సందర్భంగా ఎన్నుకున్నారు. అడ్వైజర్‌ బోర్డు సభ్యులుగా శంభు ప్రసాద్‌, పెండెం నాగార్జున, రాచర్ల బలరాం, పలుకుల యాదగిరి, దండు అంజయ్య, దర్గ కృష్ణ, లీగల్‌ అడ్వైజర్‌గా ఇంద్రసేనరావును ఎంపిక చేశారు.

అధ్యక్షుడిగా బొమ్మగాని దాస్‌గౌడ్‌, ఉపాధ్యక్షులుగా మాధవరెడ్డి శ్రీనివాసరెడ్డి, పల్లె రాములు, దేవులపల్లి పురుషోత్తం, ప్రధాన కార్యదర్శిగా బోడ విద్యాసాగర్‌ ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా విజయగిరి వెంకటాచారి, పొన్నాల రామ్‌రెడ్డి, చిదురాల సదాశివారెడ్డి, కోశాధికారిగా శామీరిపేట చంద్రయ్య బాధ్యతలు చేపట్టారు.

కార్యవర్గ సభ్యులుగా గోపు కనకయ్య, బంసి రెడ్డి నారాయణరెడ్డి, ఎండీ తహర్‌, శ్రీరామ్‌ మల్లేష్‌, మారపాక నాగయ్య, కొమురయ్య, సుధాకర్‌రెడ్డి, హనుమంతరావు, కృష్ణ, మైల ఐలయ్యలను ఎన్నుకున్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL