Vikarabad: అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదం: డ్రైవర్ అరెస్ట్, రిమాండ్!
Vikarabad: అనంతగిరి ఘాట్ రోడ్డులో నలుగురి మృతికి కారణమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో డ్రైవర్ వాసుదేవ్‌ను ధరూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Vikarabad: అనంతగిరి ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదం: డ్రైవర్ అరెస్ట్, రిమాండ్!
వికారాబాద్: తేదీ 03.10.2026న అనంతగిరి ఘాట్ రోడ్డులోని కేరెల్లి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సు డ్రైవర్ పాళ్త్యా వాసుదేవ్ @ వాసు (30), తండ్రి ధర్మా నాయక్, సంగమేష్ తండా, రేగోడ్ మండలం, మెదక్ జిల్లాను ప్రమాదానికి బాధ్యుడిగా గుర్తించి 05.10.2026న అరెస్ట్ చేశారు. నిందితుడిని న్యాయస్థానం ముందు హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.
ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. Ch. రఘురాములు (ధరూర్ - సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్) వికారాబాద్ జిల్లా.




