Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ పట్టా సరూర్‌నగర్‌లో సోదాలు

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ (OU) పేరుతో ఫేక్ బీకాం డిగ్రీ పట్టా కలిగి ఉన్న మహేశ్వరి అనే మహిళను సరూర్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

RAHUL, MEERPET
Published on: 26 May 2026 5:26 PM IST
Hyderabad
X

Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ పట్టా సరూర్‌నగర్‌లో సోదాలు

హైదరాబాద్: సరూర్‌నగర్‌లో ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ పేరుతో నకిలీ బీకాం డిగ్రీ పట్టా కలిగి ఉన్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న సాయంత్రం మహేశ్వరి అలియాస్ రేష్మ అనే మహిళ వద్ద ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందడంతో... ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సంబంధిత ఇంటిపై సోదాలు నిర్వహించడం జరిగింది.

సోదాల్లో మహేశ్వరి పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ పేరుమీద జారీ చేసినట్లు ఉన్న బీకాం డిగ్రీ పట్టా లభ్యమైంది. సర్టిఫికెట్‌పై పోలీసులు ప్రశ్నించగా ఆమె సరైన సమాధానం ఇవ్వలేకపోయింది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని సాక్షుల సమక్షంలో విచారించడం జరిగింది. విచారణలో ఆమె అట్టి ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్‌ను 2009 సంవత్సరంలో పొందినట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. నకిలీ విద్యార్హతలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story