Malkajgiri: వాణినగర్లో రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు!
Malkajgiri: మల్కాజిగిరి వాణినగర్లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమంలో భాగంగా పోలీసులు వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు.
Malkajgiri: వాణినగర్లో రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు!
మల్కాజిగిరి, అక్టోబరు 6: పోలీస్ కమిషనర్ సూచనల మేరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వాణినగర్లోని గణపతి టెంపుల్ కమాన్ వద్ద సోమవారం సాయంత్రం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్కాజిగిరి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎస్హెచ్ఓ ఎస్. విజయ్ కుమార్, ఎస్ఐ శంకర్, ట్రాఫిక్ ఎస్ఐ రవి కుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలను జాగ్రత్తగా నడుపుతూ తమతో పాటు ఇతరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచించారు.




