Meerpet: మీర్‌పేట్‌లో అక్రమ హుక్కా సెంటర్‌పై దాడి.. 21 మంది అరెస్ట్!

Meerpet: మీర్‌పేట్ మందమల్లమ్మ చౌరస్తాలో అక్రమ హుక్కా సెంటర్‌పై పోలీసుల మెరుపు దాడి 21 మంది అదుపులోకి నిర్వాహకుడు యజ్ఞేశ్వర్ రాజు అరెస్ట్.. హుక్కా సామగ్రి సీజ్.

RAHUL, MEERPET
Published on: 3 Oct 2026 9:14 PM IST
Meerpet
X

Meerpet: మీర్‌పేట్‌లో అక్రమ హుక్కా సెంటర్‌పై దాడి.. 21 మంది అరెస్ట్!

మీర్‌పేట్: హైదరాబాద్ కమిషనరేట్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా సెంటర్‌పై ఎస్‌బీ పోలీసులు, మీర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. చార్మినార్ ప్రాంతం నుంచి హుక్కా పరికరాలను తీసుకొచ్చి అక్రమంగా హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సోదాలు నిర్వహించారు.

ఈ దాడిలో మూడు హుక్కా పరికరాలు, ఒక స్టవ్, నాలుగు కాయిల్స్, హుక్కా పైపులు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుక్కా సెంటర్‌లో ఉన్న 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ నిర్వాహకుడు యజ్ఞేశ్వర్ రాజును ఎస్‌బీ పోలీసులు అరెస్ట్ చేసి మీర్‌పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET