Vanasthalipuram: స్పాపై పోలీసుల దాడి మేనేజర్, యజమాని అదుపులోకి!

Vanasthalipuram: వనస్థలిపురం ఓంకార్‌నగర్‌లో అనుమతులు లేని స్పా సెంటర్‌పై పోలీసుల దాడి. యజమాని శివ దుర్గా, మేనేజర్ సాయి సంతోష్ అదుపులోకి, కేసు నమోదు.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 25 July 2026 12:42 PM IST
Vanasthalipuram
X

Vanasthalipuram: స్పాపై పోలీసుల దాడి మేనేజర్, యజమాని అదుపులోకి!

Vanasthalipuram: వనస్థలిపురంలో స్పాపై పోలీసుల దాడి.. మేనేజర్, యజమాని అదుపులో

హైదరాబాద్... వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓంకార్ నగర్‌లో అనుమతులు లేకుండా స్పా సెంటర్ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

Relite Well Beauty & Spa* పై తనిఖీలు చేపట్టారు. తనిఖీల సమయంలో ఓ మహిళా థెరపిస్ట్ స్పాకు వచ్చిన పురుష కస్టమర్‌కు క్రాస్ మసాజ్ చేస్తూ కనిపించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో స్పా మేనేజర్ సాయి సంతోష్, స్పా యజమాని బండావత్ శివ దుర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, స్పా సెంటర్‌లో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR

Next Story