Mancherial: మంచిర్యాల జిల్లా లంబడిపల్లిలో చెన్నూరు పోలీసుల ముమ్మర తనిఖీలు!

Mancherial: మంచిర్యాల జిల్లా లంబడిపల్లిలో చెన్నూరు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి, 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి 32 వాహనాలను సీజ్ చేశారు.

RAJENDER, CHENNUR
Published on: 26 Sept 2026 7:27 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాల జిల్లా లంబడిపల్లిలో చెన్నూరు పోలీసుల ముమ్మర తనిఖీలు!

Mancherial: చెన్నూర్ మండలం లోని లంబడిపల్లి గ్రామం లో చెన్నూర్ పోలీస్ వారి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడం జరిగిందని తెలిపారు. సరైన పత్రాలు లేని, నెంబర్ ప్లేట్ లేని 30 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు సీజ్ చేసినట్లు చెన్నూరు సిఐ బన్సీలాల్ తెలిపారు.

గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా గుండుంబా తయారు చేయడానికి ఉపయోగించే సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్టు వివరించారు. అదేవిధంగా అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న 4 వ్యక్తులను తహసీల్దార్ ముందర బైండోవర్ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్ పట్టణ సీఐ బన్సీలాల్ గ్రామస్థులకు అవగాహనా కల్పిస్తూ గుడుంబా ను నిర్ములించడానికి ప్రతి ఒక్కరు తీర్మానించుకొని గుడుంబానీ అరికట్టుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని , మాదక ద్రవ్యాలకు బానిసై విలువైన జీవితం పాడుచేసుకోవద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించరాదని తెలియజేశారు.

గంజాయి, మద్యం సేవించి రాత్రి సమయాలలో సంచరించేవారి సమాచారం తెలియజేయాలనీ ప్రజలను కోరారు. అదేవిదంగా క్షనీకావేశానికి లోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఏ సమస్య కు అయిన పరిష్కారం ఉంటుందని ఆదిశగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు సిఐ బన్సీలాల్, ఎస్ ఐ శ్యామ్ పటేల్, స్పెషల్ పోలీస్, చెన్నూర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR