Chaitanyapuri: మహిళల భద్రత, సైబర్ నేరాలపై చైతన్యపురి పీఎస్‌లో అవగాహన!
Chaitanyapuri: మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో 'సహచరి' కార్యక్రమం నిర్వహించారు.
Chaitanyapuri: మహిళల భద్రత, సైబర్ నేరాలపై చైతన్యపురి పీఎస్‌లో అవగాహన!
చైతన్యపురి: మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'సహచరి' కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో 150 మంది సహచరి సభ్యులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పనితీరు, మహిళలు, బాలికలకు సంబంధించిన చట్టాలు, మానవ అక్రమ రవాణా నిరోధం, సైబర్ మోసాలు, 'నేను సైతం 2.0' కార్యక్రమంపై అధికారులు అవగాహన కల్పించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, 1930 సైబర్ హెల్ప్‌లైన్ వినియోగం, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను వివరించారు. అలాగే "నేను సైతం 2.0" కార్యక్రమం ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ (ఎస్‌ఓటీ) కె. మనోహర్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ జి. రజిత రెడ్డి, చైతన్యపురి ఇన్‌స్పెక్టర్, సీడీఈడబ్ల్యూ, భరోసా సభ్యులు, లయన్స్ క్లబ్ సైబర్ అవగాహన ఇన్‌చార్జి విజయ రాఘవ, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




