Chengicherla: చెంగిచెర్ల చెరువు కట్టపై మద్యం సేవించిన ముగ్గురిపై కేసు!
Chengicherla: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల చెరువు కట్టపై బహిరంగంగా మద్యం సేవించిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Chengicherla: చెంగిచెర్ల చెరువు కట్టపై మద్యం సేవించిన ముగ్గురిపై కేసు!
Chengicherla: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవని మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ జలెందర్ రెడ్డి హెచ్చరించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి చెంగిచెర్ల చెరువు కట్ట వద్ద ఆదివారం సాయంత్రం మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు.
చెరువు కట్టలు, పార్కులు, రహదారుల పక్కన తదితర బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా యువత బైక్ రేసింగ్‌లకు పాల్పడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించడం వంటి అవాంఛనీయ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెరువు కట్ట పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా, అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బహిరంగ ప్రదేశాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.




