Rangareddy: పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో విద్యార్థి బలవన్మరణం!
Rangareddy: రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ రెండో సంవత్సరం విద్యార్థి గండికోట జగదీష్ కళాశాల వసతి గృహంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Rangareddy: పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో విద్యార్థి బలవన్మరణం!
రంగారెడ్డి జిల్లా: పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహంలో ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన గండికోట జగదీష్ పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్ గదిలో అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో కళాశాల ఆవరణలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




