Osmania University: కాంగ్రెస్ ప్రభుత్వంపై తుంగ బాలు ఫైర్.. ఫీజు బకాయిలు ఇవ్వరా?

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో జులై 22న నిర్వహించనున్న బీఆర్ఎస్వీ విద్యార్థి సదస్సు గోడపత్రికను ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆవిష్కరించారు.

HARISH, TARNAKA
Published on: 19 Jun 2026 2:55 PM IST
Osmania University
X

Osmania University: కాంగ్రెస్ ప్రభుత్వంపై తుంగ బాలు ఫైర్.. ఫీజు బకాయిలు ఇవ్వరా?

ఉస్మానియా యూనివర్సిటీ: విద్యారంగ సమస్యల పరిష్కారానికై జులై 22వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి సదస్సును నిర్వహించనున్నారు. సదస్సుకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు.

బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ముఖ్యఅతిథిగా హాజరై గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యంగా 10 సంవత్సరాలలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం దారుణం అన్నారు.

పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికై జులై 22 వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంపల్లి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓయూ విద్యార్థి సదస్సును విద్యార్థులు, విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి నేతలు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story