Hyderabad: పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: పొన్నాల లక్ష్మయ్య!
Hyderabad: పౌల్ట్రీ లిట్టర్‌ను సేంద్రియ ఎరువుగా వినియోగించడం ద్వారా దేశానికి రూ.86,400 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్‌లో పేర్కొన్నారు.
Hyderabad: పౌల్ట్రీ లిట్టర్‌తో రూ.86,400 కోట్ల ఆదా సాధ్యం: పొన్నాల లక్ష్మయ్య!
హైదరాబాద్: పౌల్ట్రీ లిట్టర్‌ను సేంద్రియ ఎరువుగా వినియోగించడం ద్వారా దేశానికి రూ.86,400 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి, పౌల్ట్రీ లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 18వ పౌల్ట్రీ ఇండియా ప్రదర్శన రెండో రోజు ఆయన పాల్గొని మాట్లాడారు.
యూరియా వినియోగానికి బదులుగా పౌల్ట్రీ లిట్టర్‌ను ప్రోత్సహిస్తే ఎరువుల సబ్సిడీ భారం తగ్గడంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పౌల్ట్రీ లిట్టర్ శుద్ధి, గుళికల తయారీ, రైతులకు సరఫరా కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్, ట్రెజరర్ ఎం. శ్రీకాంత్, సెక్రటరీ నటరాజన్ పాల్గొన్నారు.




