Vikarabad: ఫ్యూజ్ వేయాలంటే డబ్బులు డిమాండ్ బాధితుల ఆరోపణ!

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ లో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.

WAZID, PARIGI
Published on: 2 Aug 2026 9:29 AM IST
Vikarabad
X

Vikarabad: ఫ్యూజ్ వేయాలంటే డబ్బులు డిమాండ్ బాధితుల ఆరోపణ!

Vikarabad: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం తిరుమలాపూర్ గ్రామ పరిధిలోని ఫామ్ హౌస్‌లలో విద్యుత్ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ పోయి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నా, విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.లైన్‌మెన్‌కు ఫోన్ చేస్తే "నేను లేను... రేపు వస్తా" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, అత్యవసర సేవల కోసం ఇచ్చిన ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే స్పందనే ఉండడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు... లైన్‌మెన్‌కు బదులుగా ఓ ప్రైవేట్ వ్యక్తిని పంపించి, రూ.500 ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ వేస్తానని డిమాండ్ చేశాడు..డబ్బులు చెల్లించిన తర్వాతే ఫ్యూజ్ వేసినట్లు బాధితులు చెబుతున్నారు.ప్రభుత్వ సేవలను ప్రైవేట్ వ్యక్తులతో నిర్వహించడం వెనుక అసలు కారణం ఏమిటి? ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఒక రోజు కరెంట్ బిల్లు ఆలస్యమైతే వెంటనే విద్యుత్ కనెక్షన్ కట్ చేసే అధికారులు... అదే ప్రజలకు సమస్య వస్తే మాత్రం ఎందుకు స్పందించడం లేదని తిరుమలాపూర్ గ్రామ ప్రజలు,ఫామ్ హౌస్ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తిరుమలాపూర్ గ్రామంలోని ఫామ్ హౌస్‌లలో నెలకొన్న ఈ విద్యుత్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి, ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story