Hyderabad: ప్రజల సంక్షేమం, భద్రతే ప్రజాపాలన లక్ష్యం: సైబరాబాద్ సీపీ!

Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు. ప్రజల సంక్షేమం, భద్రత, అభివృద్ధే ప్రజాపాలన లక్ష్యమని సీపీ డా. ఎం. రమేష్ పిలుపునిచ్చారు.

VISHWANATH, SHERILINGAMPALLY
Published on: 17 Sept 2026 12:05 PM IST
Hyderabad
X

Hyderabad: ప్రజల సంక్షేమం, భద్రతే ప్రజాపాలన లక్ష్యం: సైబరాబాద్ సీపీ!

Hyderabad: ప్రజల సంక్షేమం, భద్రత, అభివృద్ధే ప్రజాపాలనకు ప్రధాన లక్ష్యం: సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ గారు పోలీసు సిబ్బంది కి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, భద్రత, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేయడం ప్రజాపాలనలో అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించడమే ప్రజాపాలన యొక్క ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ముఖ్యంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, మహిళలు, బాలికలు, వృద్ధులు మరియు వలస కార్మికుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.

ప్రజలు కూడా చట్టాలను గౌరవిస్తూ, పోలీసులకు సహకరించాలని సీపీ గారు కోరారు. ప్రజలు–పోలీసుల మధ్య పరస్పర నమ్మకం, సహకారం మరింత బలోపేతం అయినప్పుడే సురక్షితమైన మరియు అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమని అన్నారు. సైబరాబాద్ పోలీస్ శాఖ నిరంతరం అంకితభావంతో పనిచేస్తుందని సీపీ గారు స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, ఎస్‌బీ డీసీపీ వై.వి.ఎస్. సుధీంద్ర, హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అడిషనల్ డీసీపీ షమీర్‌తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

VISHWANATH, SHERILINGAMPALLY

VISHWANATH, SHERILINGAMPALLY