Uppal: 108 అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం – మగబిడ్డకు జన్మ

Uppal: హైదరాబాద్ ఉప్పల్‌లో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు 108 అంబులెన్స్‌లోనే ప్రసవం చేసిన సిబ్బంది. గాంధీ ఆసుపత్రికి తరలింపు, తల్లీబిడ్డ క్షేమం.

KARUNAKAR, UPPAL
Published on: 21 Aug 2026 10:36 PM IST
Uppal
X

Uppal: 108 అంబులెన్స్‌లోనే మహిళకు ప్రసవం – మగబిడ్డకు జన్మ

ఉప్పల్‌: పురిటి నొప్పులతో ఆసుపత్రికి తరలిస్తున్న ఓ మహిళకు 108 అంబులెన్స్‌లోనే ప్రసవం జరిగింది. ఉప్పల్‌ భరత్‌నగర్‌కు చెందిన రీషా పర్వీన్‌ (25)కు శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు.

సమాచారం అందుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ నాగరాజు, పైలెట్‌ నవీన్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు. రీషా పర్వీన్‌ను అంబులెన్స్‌లో గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రం కావడంతో.. అంబులెన్స్‌లోనే ఆమెకు ప్రసవం చేశారు.

దీంతో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి అంబులెన్స్‌లోనే ప్రసవం చేయడంతో 108 సిబ్బందిని కుటుంబ సభ్యులు అభినందించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL

Next Story