Kukatpally: భవన నిర్మాణ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డుల పంపిణీ!
Kukatpally: కూకట్‌పల్లి ఏవీబీపురంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ భవన నిర్మాణ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులను పంపిణీ చేశారు.
Kukatpally: భవన నిర్మాణ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డుల పంపిణీ!
Kukatpally: ఏవీబీ పురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత రెండు వారాలుగా ఈ-శ్రమ్, లేబర్ కార్డులకు నమోదు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులకు ఈ-శ్రమ్ కార్డులను కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి, పార్టీ జాయినింగ్ కమిటీ సభ్యుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక సంక్షేమ పథకాలను ప్రతి అర్హ కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్మిక కుటుంబాల సంక్షేమానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, టి. ప్రసాద్‌రావు, వై. ధనుంజయ్, బి. రాము, జి. దుర్యోధన్, డి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Next Story




