Tandur: రైతులకు నిరంతరం సొసైటీల అండ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!
Tandur: రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కొండంత అండగా ఉంటాయని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు.
Tandur: రైతులకు నిరంతరం సొసైటీల అండ: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి!
Tandur: రైతులకు అండగా ఉండి అనునిత్యం సహాయ సహకారాలు అందించేది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్మకన్నె చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన జనార్దన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు. రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందించే విధంగా కృషి చేద్దామన్నారు.
సొసైటీ ద్వారా ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామన్నారు. ప్రతి సొసైటీని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందన్నారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా రైతులందరికీ రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించామన్నారు. రైతు పక్షపాతిగా కోటిపల్లి ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వాలు 30 సంవత్సరాలుగా కోటిపల్లి ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. కోటిపల్లి ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయన్నారు. రెండు మూడు నెలలు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందిస్తామన్నారు. కొడంగల్ కు నీటిని తీసుకు వెళ్తున్నామని ప్రతిపక్ష పార్టీలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకువెళ్తున్నామని అబద్ధపు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు ఒకసారి తాండూరు జిల్లా ఆస్పత్రికి సందర్శించాలన్నారు.
కొడంగల్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లు తాండూరు జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. 6 నెలల నుండి 9 మాసాల మధ్య తాండూరు ప్రజలకు కాగ్న నీటిని అందిస్తామన్నారు. ప్రతి రోడ్డును పూర్తి చేసే బాధ్యత కానీ తీసుకుంటున్నానన్నారు అతి త్వరలో ప్రతి రోడ్డును పూర్తి చేసి తాండూరు నియోజకవర్గ ప్రజలకు అందిస్తానన్నారు.
పబ్బులు క్లబ్బుల డ్రగ్గుల కూర్చునే సన్నాసులు వారికి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారన్నారు. కొడంగల్ నుంచి చించోలి వరకు రోడ్డు పెండింగ్ ఉంటే కేంద్రమంత్రి గడ్కరి వద్ద కూర్చుని పనిలను మళ్లీ పునః ప్రారంభించామన్నారు. తాండూర్ లో ఉన్న ఏటీసీ సెంటర్ ద్వారా 100% ఉద్యోగాలను అందించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.
బషీరాబాద్ లో కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వాలు శిలాఫలకాలు వేసి మర్చిపోయిన అభివృద్ధి పనులను తిరిగి తాను ముందుండి పూర్తి చేశానన్నారు. 30 పడకల ఆస్పత్రిని బషీరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. మరో సంవత్సరంలో పూర్తిస్థాయి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.




