Dharur: ఎనిమిదైనా తెరవని పీహెచ్‌సీ.. డాక్టర్ రాకపై స్థానికుల ఆగ్రహం!
Dharur: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. పల్స్ పోలియో రెండో రోజు కార్యక్రమం ఉన్నా ఆసుపత్రికి తాళం వేసి ఉండటంపై నిరసన వ్యక్తమవుతోంది.
Dharur: ఎనిమిదైనా తెరవని పీహెచ్‌సీ.. డాక్టర్ రాకపై స్థానికుల ఆగ్రహం!
వికారాబాద్ జిల్లా: పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పోలియో చుక్కలు మిస్సయిన పిల్లలకు ఇంటింటికి తిరిగి వేయాల్సి ఉంటుంది.ఇందుకోసం ఉదయాన్నే ధారూర్ ఆస్పత్రి నుంచి వాక్సినేషన్ బాక్స్ లను పంపిణీ చేయాల్సి ఉంటుంది.
కానీ ధారూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం ఎనిమిది(8) గంటలు కావస్తున్న ఎలాంటి చలనం లేదు.
ఆసుపత్రి గేటు తాళంతో దర్శనమిస్తుంది.డాక్టర్ రాకపోవడమే ఇందులకు కారణం.ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు తమ కుటుంబాలు పిల్లలతో కలిసి ఉదయాన్నే పొలాలకు పరుగుతీస్తుంటారు.
రెండో రోజు పోలియో చుక్కలు వేయడానికి ఉదయాన్నే వెళ్లకుంటే పిల్లలు ఎలా పోలియో చుక్కలు వేసుకుంటారు.
పోలియో చుక్కలు వేసే సమయంలో కూడా ఆస్పత్రి సమయానికి తెరవకపోవడం,డాక్టర్ రాకపోవడంపై రాజకీయ నాయకులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందులకు కారణమని వారు ఆరోపిస్తున్నారు.
పోలియో చుక్కల టార్గెట్ ను పూర్తి చేయాలన్న లక్ష్యం దీనివలన నీరు గారు పోవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు.డాక్టర్ స్థానికంగా ఉంటే సమయానికి డ్యుటికి వచ్చి విధులు నిర్వహిస్తారు.
ఆలస్యంగా వచ్చినా కూడా రిజిస్టర్ లో మాత్రం సమయానికే వచ్చినట్టు సంతకం చేస్తారు.వేతనం పూర్తిగా తీసుకుంటారు.
ఏమి చేసినా, ఎప్పుడు వచ్చినా పట్టించుకునే నాథుడే లేడు అని అంటున్నారు స్థానిక ప్రజలు




